venkatesh ayyar: మరొకరి ఖాళీని భర్తీ చేయడానికి లేను.. జట్టు విజయం కోసం నా సత్తా చూపిస్తా..: వెంకటేశ్ అయ్యర్ 

I am not here to fill another shoes
  • బౌలింగ్ అవకాశం వస్తే నిరూపించుకుంటా
  • మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు కష్టపడతా
  • జట్టుతోనే ఉన్నానని అనుకుంటున్నా
ఆట మొదలు పెట్టిన ప్రతి క్రికెటర్ దేశం కోసమే ఆడాలనుకుంటాడని, తనకు అది నెరవేరడం సంతోషంగా ఉందని స్టార్ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పేర్కొన్నాడు. అందరూ తనను స్వాగతించినట్టు చెప్పాడు. ఈ మేరకు ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించాడు.

బౌలింగ్ చేసే అవకాశం ఎప్పుడు వచ్చినా తన వంతు మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు కచ్చితంగా ప్రయత్నిస్తానని వెంకటేశ్ అయ్యర్ చెప్పాడు. బౌలింగ్ పై తన సాధన కొనసాగుతుందని, అది ఎప్పటికీ ముగిసిపోదన్నాడు. కచ్చితత్వం కోసం తాను ఇంకా కష్టించాల్సి ఉందని, కొన్ని అంశాల్లో మెరుగుపడాల్సి ఉందన్నాడు.

ఫిట్ నెస్ సమస్యతో బాధపడుతున్న ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్లీ జట్టులోకి వస్తే ఒత్తిడి పెరుగుతుందా? అన్న ప్రశ్నకు.. మరొకరి ఖాళీని భర్తీ చేయడానికి తాను లేనని అయ్యర్ బదులిచ్చాడు. ‘‘జట్టు విజయానికి నా సేవలు అందించాలని అనుకుంటున్నాను. ఒక ఆటగాడు తిరిగి వస్తాడు, నేను జట్టులో లేననే ఆలోచనలు నాకు రావు. నేను జట్టులోనే ఉన్నాను. బ్యాట్, బౌల్ చేయగలనని భావిస్తుంటాను’’అని అయ్యర్ చెప్పాడు. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు సభ్యుడైన అయ్యర్ గతేడాది ఐపీఎల్ రెండో భాగంలో మెరుగైన ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిలో పడడం తెలిసిందే.
venkatesh ayyar
cricketer
kolkatha night riders

More Telugu News