సుదీప్ సినిమాకి రిలీజ్ డేట్ ఖరారు!

08-01-2022 Sat 17:36
  • కన్నడ స్టార్ హీరోగా సుదీప్
  • తాజా చిత్రంగా 'విక్రాంత్ రోనా'
  • దర్శకుడిగా అనూప్ భండారి
  • వచ్చేనెల 24న థియేటర్స్ లో రిలీజ్  
Vikranth Rona Movie Release on Feb 24th
కన్నడ స్టార్ హీరోలలో సుదీప్ స్థానం ప్రత్యేకం. విలన్ పాత్రలతో మంచి పేరు తెచ్చుకున్న ఆయన స్టార్ హీరోగా వెలుగుతున్నారు. డైలాగ్ డెలివరీలో ఆయనకంటూ ఒక స్టైల్ ఉంది. ఆ ప్రత్యేకతని ఆయనను స్టార్ ను చేసింది. తెలుగు .. తమిళ భాషల్లోను ఆయనకి మంచి క్రేజ్ ఉంది.

ఆయన తాజా చిత్రంగా 'విక్రాంత్ రోనా' రూపొందింది. షాలినీ ఆర్ట్స్ - జీ స్టూడియోస్ వారితో కలిసి సుదీప్ ఈ సినిమాను నిర్మించాడు. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాకి అనూప్ భండారి దర్శకత్వం వహించాడు. విభిన్నమైన కథాకథనాలతో సాగే ఈ సినిమాలో సుదీప్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు.

ఈ సినిమాకి ఓటీటీ వైపు నుంచి భారీ ఆఫర్ వచ్చిందనీ, అందువలన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారానే ప్రేక్షకుల ముందుకు వస్తుందనే వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఫిబ్రవరి 24వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నట్టు చెబుతూ, అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు..