Sonu Sood: పంజాబ్ ఐకాన్ గా సోనూ సూద్ నియామకాన్ని రద్దు చేసిన ఎన్నికల సంఘం

  • గతంలో పంజాబ్ ఐకాన్ గా సోనూ సూద్ నియామకం
  • ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రచారకర్తగా సోనూ
  • వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సోనూ సోదరి
  • ఈ నేపథ్యంలోనే పంజాబ్ ఎస్ఈసీ నిర్ణయం!
EC withdraws Sonu Sood appointment as Punjab Icon

ప్రముఖ నటుడు, దాత సోనూ సూద్ ను గతంలో పంజాబ్ ఐకాన్ గా నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ఎన్నికల సంఘం వెనక్కి తీసుకుంది. జనవరి 4న ఈ నియామక ఉత్తర్వులను ఉపసంహరించుకున్నట్టు పంజాబ్ ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ ఎస్.కరుణరాజు వెల్లడించారు. ఈ నిర్ణయానికి కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆమోదముద్ర వేసిందని తెలిపారు.

పంజాబ్ ప్రజల్లో చైతన్యం కలిగించి ఓటింగ్ శాతం పెంచేందుకు 2020 నవంబరులో సోనూ సూద్ ను ప్రచారకర్తగా నియమించడం తెలిసిందే. అయితే, సోనూ సూద్ సోదరి మాళవిక సచేర్ (39) రానున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో ఈసీ తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

మాళవిక పంజాబ్ లోని మోగా నియోజకవర్గం నుంచి బరిలో దిగాలని భావిస్తున్నారు. అయితే ఆమె ఏ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతారన్న విషయం తెలియరాలేదు. సోనూ సూద్ స్వస్థలం పంజాబ్ లోని మోగా. సోదరి రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయం తీసుకున్న తర్వాత సొంతగడ్డకు ఆయన ప్రాధాన్యత ఇచ్చారు.

More Telugu News