వనమా రాఘవను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన పోలీసులు... 14 రోజుల రిమాండ్
- పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య
- ఎమ్మెల్యే వనమా కుమారుడు రాఘవపై ఆరోపణలు
- ఏపీ వైపు పారిపోతుండగా పట్టుకున్న పోలీసులు
- కొత్తగూడెం మేజిస్ట్రేట్ ముందు హాజరు
గతంలో అతడిపై 11 కేసులు ఉన్నట్టు ఏఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. తాజాగా రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో రాఘవతో పాటు 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి రాఘవతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేయగా, మిగిలినవారు పరారీలో ఉన్నారు.
కాగా, తన కుమారుడిపై ఆరోపణలు రావడంతో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బహిరంగ లేఖ రాయడం తెలిసిందే. తన కుమారుడు పోలీసు విచారణకు సహకరించేలా చేస్తానని ఆయన స్పష్టం చేశారు.