Johannesburg Test: ఎట్టకేలకు ప్రారంభమైన నాలుగో రోజు ఆట... విజయానికి చేరువలో దక్షిణాఫ్రికా

Fourth day play starts in Johannesburg test
  • జోహాన్నెస్ బర్గ్ లో నిలిచిన వర్షం
  • తొలి రెండు సెషన్లు వర్షార్పణం
  • వాన్ డర్ డుస్సెన్ వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
జోహాన్నెస్ బర్గ్ లో వరుణుడు శాంతించాడు. దాంతో రెండో టెస్టు నాలుగోరోజు ఆట ఎట్టకేలకు ప్రారంభమైంది. తొలి రెండు సెషన్లు వర్షార్పణం కాగా, మూడో సెషన్ లో ఆట సాధ్యమైంది. ఓవర్ నైట్ స్కోరు 118-2తో రెండో ఇన్నింగ్స్ షురూ చేసిన దక్షిణాఫ్రికా రాస్సీ వాన్ డర్ డుస్సెన్ వికెట్ కోల్పోయింది. డుస్సెన్ 92 బంతుల్లో 40 పరుగులు చేసి షమీ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆతిథ్య జట్టు 59 ఓవర్లలో 3 వికెట్లకు 191 పరుగులు చేసింది. విజయం సాధించేందుకు మరో 49 పరుగులు అవసరం కాగా, క్రీజులో కెప్టెన్ డీన్ ఎల్గార్ (72 బ్యాటింగ్), టెంబా బవుమా (3 బ్యాటింగ్) ఉన్నారు.
Johannesburg Test
Fourth Day
Rain
Team India
South Africa

More Telugu News