Mahesh Babu: మహేశ్ బాబుకు కరోనా పాజిటివ్

Tollywood superstar Mahesh Babu tested corona positive
  • ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వచ్చిందన్న మహేశ్
  • స్వల్ప లక్షణాలు ఉన్నాయని వెల్లడి
  • తనను కలిసినవాళ్లు టెస్టులు చేయించుకోవాలని సూచన
  • ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని స్పష్టీకరణ
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కరోనా బారినపడ్డారు. తనకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందని మహేశ్ బాబు స్వయంగా వెల్లడించారు. అభిమానులు, శ్రేయోభిలాషుల కోసం ప్రత్యేకంగా ప్రకటన వెలువరించారు. ఎన్ని ముందుజాగ్రత్తలు తీసుకున్నా కరోనా సోకిందని, స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నానని తెలిపారు. ప్రస్తుతం వైద్య మార్గదర్శకాలు పాటిస్తూ ఇంటి వద్దే ఐసోలేషన్ లో ఉన్నానని వివరించారు.

గత కొన్నిరోజులుగా తనను కలిసినవారందరూ తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకోవాలని మహేశ్ బాబు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, ఎవరైనా ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోకుండా ఉన్నట్టయితే వారందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే కరోనా సోకినా గానీ తీవ్ర లక్షణాలు ఉండవని, ఆసుపత్రి పాలయ్యే అవసరాన్ని తగ్గిస్తుందని వెల్లడించారు. త్వరలోనే ఆరోగ్యం సంతరించుకుని మళ్లీ మీ ముందుకు వస్తాను అంటూ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల మహేశ్ బాబు తన కుటుంబంతో కలిసి విదేశీ యాత్రకు వెళ్లివచ్చారు. 
Mahesh Babu
Corona Virus
Positive
Tollywood

More Telugu News