Komatireddy Venkat Reddy: డీజీపీ మహేందర్ రెడ్డికి మంచిపేరుంది.... వనమా తనయుడ్ని వెంటనే అరెస్ట్ చేయాలి: ఎంపీ కోమటిరెడ్డి

Komatireddy demands Vanama Raghavendar arrest
  • పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య
  • పరారీలో ఎమ్మెల్యే వనమా తనయుడు
  • రాష్ట్రంలో పేరుకే హోంమంత్రి ఉన్నాడన్న కోమటిరెడ్డి
  • ఆయనను ప్రశ్నించడం వ్యర్థం అని వ్యాఖ్యలు
పాల్వంచలో రామకృష్ణ అనే వ్యక్తి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దీనపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ, ఓ ఎమ్మెల్యే కుమారుడు ఇంతటి నీచానికి దిగితే చర్యలు తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు.

తెలంగాణలో పేరుకు మాత్రమే హోం మంత్రి ఉన్నారని, ఆయనను ప్రశ్నించి కూడా ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డికి మంచి పేరుందని, వనమా రాఘవేందర్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు అతడిపై చర్యలు తీసుకోకపోవడం దారుణమని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. అతడు ఎక్కడ ఉన్నాడో పోలీసులు లొకేషన్ ను కనుగొనలేరా? అని నిలదీశారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో రాఘవేందర్ ను ఏ2గా పేర్కొన్నారని, కానీ అతడిని ఏ1గా మార్చాలని డిమాండ్ చేశారు.
Komatireddy Venkat Reddy
Vanama Raghavendar
Arrest
DGP Mahendar Reddy
Ramkrishna
Suicide
Palwancha
Bhadradri Kothagudem District

More Telugu News