గుజరాత్‌లో కెమికల్ ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్.. ఆరుగురి మృతి.. 20 మందికి అస్వస్థత
- తెల్లవారుజామున ఘటన
- రోడ్డు పక్కన ట్యాంకర్
- మిల్లులో ఉన్న వారికి కూడా ఊపిరాడక ఇబ్బందులు
ట్యాంకర్ నుంచి విషవాయువు రావంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. విశ్వప్రేమ్ మిల్లులో పని చేసే కార్మికులు ఆ వాయువు పీల్చడంతో సృహ కోల్పోయి అక్కడికక్కడే పడిపోయారు. కెమికల్ ట్యాంకర్ కు 10 మీటర్ల దూరంలో వారు ఆ సమయంలో నిద్రిస్తున్నట్లు తెలిసింది. మిల్లులో ఉన్న వారు కూడా ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.