Sajjala Ramakrishna Reddy: ముందస్తు ఎన్నికలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల క్లారిటీ!

Sajjala Ramakrishna Reddy comments on elections
  • ఐదేళ్లు పాలించమని ప్రజలు మాకు అధికారం ఇచ్చారు
  • ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదు
  • చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న సజ్జల 
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉండొచ్చనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. తమకు ప్రజలు అధికారాన్ని కట్టబెట్టింది ఐదేళ్లు పాలించడానికని ఆయన అన్నారు. ప్రజాతీర్పు మేరకు తాము పూర్తి కాలం పాలిస్తామని చెప్పారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనే లేదని స్పష్టం చేశారు.

ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని సజ్జల చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం అప్పులు చేస్తోందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పటికీ ఉద్యోగుల సంక్షేమం కోసం పీఆర్సీ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
Sajjala Ramakrishna Reddy
Jagan
YSRCP
Chandrababu
Telugudesam
Elections

More Telugu News