actor meena: 2022లో మా ఇంటికి వచ్చిన తొలి అతిథి కరోనా..!: సినీ నటి మీనా

First visitor to my home in 2022 actor meena
  • మా కుటుంబం మొత్తాన్ని ఇష్టపడింది
  • నేను దాన్ని ఉండనివ్వను
  • అందరూ జాగ్రత్తగా ఉండండి
  • ట్విట్టర్ లో పోస్ట్ పెట్టిన మీనా 
సీనియర్ నటీమణి మీనా అభిమానులు ఊహించని పోస్ట్ తో వారి ముందుకు వచ్చారు. తన కుటుంబం మొత్తానికి కరోనా వచ్చినట్టు బాంబు పేల్చారు. పైగా ఈ విషయాన్ని ఆమె కొంచెం హాస్యం, కొంచెం వెటకారం జోడించి పోస్ట్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.  

‘‘2022లో మా ఇంటికి వచ్చిన తొలి అతిథి మిస్టర్ కరోనా. మా కుటుంబం మొత్తాన్ని ఇష్టపడింది. కానీ, నేను దాన్ని ఉండనివ్వను. ప్రజలారా జాగ్రత్త. భద్రంగా ఉండాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. బాధ్యతగా మసలుకోండి. కరోనా వ్యాప్తికి అవకాశం ఇవ్వకండి. మీ ప్రార్థనల్లో మాకూ చోటివ్వండి’’ అంటూ ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

రెండు దశాబ్దాల క్రితం స్టార్ హీరోయిన్ గా మీనా చేసిన సినిమాలు గుర్తుండే ఉంటాయి. తన నటనతో ఆమె  ఎంతో మంది మనసులను గెలుచుకున్నారు. తాజా ట్విట్టర్ పోస్ట్ లో ఆమె పోస్ట్ చేసిన ఫొటో ఎంతో ఆకట్టుకుంటోంది. ఆకర్షణీయమైన వస్త్రధారణతో ‘మీనా వయసు తగ్గించుకుందా’ అన్న సందేహం వచ్చేలా కనిపిస్తోంది.
actor meena
corona
twiiter post

More Telugu News