Kodali Nani: రాధాకు ఏదైనా జరిగితే చంద్రబాబుకే ప్రయోజనం: కొడాలి నాని

Chandrababu is a political prostitute says Kodali Nani
  • రాధాకు భద్రత కల్పించాలని సీఎంను నేను అడగలేదు
  • రెక్కీ జరిగిందనే విషయాన్ని మాత్రమే సీఎం దృష్టికి తీసుకెళ్లాను
  • చంద్రబాబు ఒక రాజకీయ వ్యభిచారి
తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారంటూ టీడీపీ నేత వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మంత్రి కొడాలి నాని స్పందిస్తూ... తన హత్యకు రెక్కీ జరిగిందనే విషయాన్ని రాధా తన సమక్షంలోనే చెప్పారని అన్నారు.

ఇదే విషయాన్ని తాను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. దీంతో వెంటనే విచారణ జరిపించాలని, రాధాకు గన్ మెన్లతో భద్రత కల్పించాలని సీఎం ఆదేశించారని చెప్పారు. భద్రత కల్పించాలని రాధా తనను అడగలేదని, తాను కూడా ముఖ్యమంత్రిని అడగలేదని తెలిపారు.

గన్ మెన్లను తీసుకోవడం, తీసుకోకపోవడం రాధా ఇష్టమని కొడాలి నాని అన్నారు. రాధా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాధాకు ఏదైనా జరిగితే చంద్రబాబుకే ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. పోలీసులకు సహకరించాలా, వద్దా అనే విషయం కూడా రాధా వ్యక్తిగత విషయమని అన్నారు.

తాను చంద్రబాబు మాదిరి రాజకీయ వ్యభిచారిని కాదని... అందుకే ఆయనలా నోటికి వచ్చినట్టు మాట్లాడలేనని చెప్పారు. మరోవైపు రాధా హత్యకు రెక్కీ జరిగిందని చెప్పేందుకు ప్రాథమిక ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు.
Kodali Nani
Jagan
YSRCP
Vangaveeti Radha
Chandrababu
Telugudesam

More Telugu News