Revanth Reddy: ఇదిగో డ్రామా మొదలైంది:రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Revanth Reddy comments on Bandi Sanjay arrest and further developments
  • బండి సంజయ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు
  • తీవ్ర ఆగ్రహంతో ఉన్న బీజేపీ
  • జేపీ నడ్డా ఆధ్వర్యంలో నేడు కొవ్వొత్తుల ర్యాలీ
  • అనుమతి లేదంటున్న పోలీసులు
  • వ్యంగ్యంగా స్పందించిన రేవంత్ 
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ కావడం, ఆగ్రహావేశాలతో ఊగిపోతున్న బీజేపీ శ్రేణులు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో ర్యాలీకి సిద్ధపడడం వంటి పరిణామాలపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. డ్రామా మొదలైంది అంటూ వ్యాఖ్యానించారు.

బండి సంజయ్ అరెస్ట్ తో పార్ట్-1 పూర్తయిందని, పార్ట్-2లో భాగంగా జేపీ నడ్డా గారిని ఇవాళ కస్టడీలోకి తీసుకుంటారని వెల్లడించారు. ఇదంతా కూడా బీజేపీనే తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమని చూపించడం కోసమేనా? అని రేవంత్ ప్రశ్నించారు.

"సరే, ఈ విషయం నేను బహిర్గతం చేశాను కాబట్టి, డ్రామా ఎలా సాగుతుందో చూద్దాం" అంటూ ట్వీట్ చేశారు.  అటు, కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించేందుకు బీజేపీ పట్టుదలగా ఉండగా, ర్యాలీకి అనుమతిలేదని పోలీసులు చెబుతుండడం తెలిసిందే.
Revanth Reddy
Bandi Sanjay
Arrest
Drama
JP Nadda
Rally
BJP
Telangana

More Telugu News