పోలీస్ కమిషనర్ చివరకు ఓ కానిస్టేబుల్ మాదిరి ప్రవర్తించారు: ఈటల రాజేందర్
- బండి సంజయ్ ను అరెస్ట్ చేయడం సరికాదు
- పోలీసులు చిల్లరగా ప్రవర్తించారు
- కేసీఆర్ ఆదేశాలతో పోలీసులు దారుణంగా వ్యవహరించారు
ఉద్యోగులు, ఉపాధ్యాయ బదిలీలు గందరగోళంగా ఉన్నాయని ఈటల అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల భర్త ఒక చోట, భార్య మరో చోట, పిల్లలు ఇంకో చోట ఉండాల్సి వస్తోందని చెప్పారు. కుటుంబాలు చెల్లాచెదురు అవుతున్నాయని అన్నారు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకునే బండి సంజయ్ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ దీక్ష చేపట్టారని... అయినా అనుమతులు లేవంటూ ఆయనను అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు.
సీఎం ఆదేశాలతో పోలీసులు దారుణంగా ప్రవర్తించారని... కానిస్టేబుల్ నుంచి కమిషనర్ వరకు అన్ని పనులను సీపీనే చేశారని చెప్పారు. తమను ఇబ్బంది పెట్టినా పర్లేదని, ఉపాధ్యాయులకు మాత్రం అన్యాయం చేయొద్దని ఈటల అన్నారు.