Hyderabad: కొంపముంచిన వాట్సాప్ డీపీ.. నగ్నఫొటోలు వైరల్ చేస్తామని బెదిరింపులు

Unknown persons allegedly morphing woman photo and demand for money
  • హైదరాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌లో ఘటన
  • రూ.1.20 లక్షలు సమర్పించుకున్నా ఆగని వేధింపులు
  • సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
భార్యతో కలిసి దిగిన ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకోవడం అతడి పాలిట శాపమైంది. ఆ ఫొటోను సేకరించిన గుర్తు తెలియని వ్యక్తులు..  మహిళ ఫొటోను మార్ఫింగ్ చేసి నగ్నంగా మార్చారు. ఆపై దానిని అతడి వాట్సాప్‌కే పంపి తన ఖాతాకు బిట్‌కాయిన్స్ ట్రాన్స్‌ఫర్ చేయాలని బెదిరించారు. లేదంటే ఈ న్యూడ్ ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ చేయడంతోపాటు బంధువులు, స్నేహితులకు పంపిస్తానని హెచ్చరించారు.

దీంతో ఏం చేయాలో పాలుపోని హైదరాబాద్, దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన బాధితుడు నిందితుడి ఖాతాకు రూ. 1.20 లక్షలు బదిలీ చేశాడు. అయినప్పటికీ నిందితుల నుంచి వేధింపులు ఆగకపోవడంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
Dilsukhnagar
Cyber Crime
Whatsapp DP
Bitcoin

More Telugu News