Bellamkonda Srinivas: హిందీ 'ఛత్రపతి' మంచి స్పీడ్ మీదే ఉన్నాడే!

Chathrapathi remake completed talky part
  • తెలుగులో హిట్ కొట్టిన 'ఛత్రపతి'
  • హిందీ రీమేక్ లో బెల్లంకొండ 
  • దర్శకుడిగా వినాయక్ 
  • ఈ ఏడాదిలోనే రిలీజ్  

మాస్ యాక్షన్ హీరోగా ప్రభాస్ ను మరోమెట్టు ఎక్కించిన సినిమాగా 'ఛత్రపతి' కనిపిస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో 2005లో వచ్చిన ఈ సినిమా, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కీ .. ఆయన డైలాగ్ డెలివరీకి తగిన కథాకథనాల కారణంగా .. రాజమౌళి టేకింగ్ కారణంగా ఈ సినిమా హిట్ కొట్టేసిందని చెప్పుకున్నారు.

ఇంతకాలానికి ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేయాలని పెన్ స్టూడియోస్ వారు భావించారు. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాతో బాలీవుడ్ కి పరిచయం కావాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం గట్టిగానే కసరత్తులు చేసి సిక్స్ ప్యాక్ సాధించాడు. మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడిగా పేరున్న వినాయక్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.

ఈ మధ్యనే సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా అప్పుడే టాకీ పార్టును పూర్తిచేసుకుందని చెబుతున్నారు. ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉన్న నటీనటులు .. సాంకేతిక నిపుణులు పనిచేయడం విశేషం. హిట్ లు .. ఫ్లాపులు పక్కన పెడితే, తెలుగులో బెల్లంకొండ చేసినవన్నీ భారీ సినిమాలే. అలాగే భారీ సినిమాతోనే బాలీవుడ్ కి పరిచయమవుతున్నాడు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Loading...

More Telugu News