Kishan Reddy: నటుడు కోట శ్రీనివాసరావు నివాసంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సందడి... ఫొటోలు ఇవిగో!

Kishan Reddy visits senior actor Kota Srinivasarao
  • హైదరాబాదులో పర్యటిస్తున్న కిషన్ రెడ్డి
  • కోట నివాసానికి వెళ్లిన వైనం
  • సీనియర్ నటుడితో సరదా ముచ్చట్లు
  • కోట ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న కిషన్ రెడ్డి
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాదులో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు నివాసానికి వెళ్లి, ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురి మధ్య ఎంతో ఉల్లాసభరిత వాతావరణంలో భేటీ జరిగింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి... కోట ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కోట శ్రీనివాసరావు గత నాలుగు దశాబ్దాలుగా చిత్రపరిశ్రమకు సేవలందిస్తున్నారని కొనియాడారు. కోట ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.
Kishan Reddy
Kota Srinivasarao
Actor
Tollywood
BJP
Telangana

More Telugu News