Bandi Sanjay: బండి సంజయ్ కి 14 రోజుల రిమాండ్

Bandi Sanjay sent to 14 days remand
  • కరీంనగర్ లో నిన్న జాగరణ దీక్ష చేపట్టిన బండి సంజయ్
  • కోవిడ్ నిబంధనలను పాటించలేదని కేసు నమోదు
  • సంజయ్ తో పాటు మరో నలుగురికి రిమాండ్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు కరీంనగర్ జిల్లా సెషన్స్ కోర్టు బెయిల్ నిరాకరించింది. ఆయన బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. సంజయ్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 17వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. సంజయ్ తో పాటు కొర్పొరేటర్ పెద్దపల్లి జితేందర్, పుప్పాల రఘు, కాచు రవి, మర్రి సతీశ్ కు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

ఆదివారం రాత్రి కరీంనగర్ లో జాగరణ పేరుతో బండి సంజయ్ దీక్ష చేపట్టారు. అయితే కోవిడ్ నిబంధనలను అతిక్రమించి దీక్ష చేపట్టరాదని పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఆయన దీక్ష చేపట్టారు. దీంతో వారిపై కేసులు నమోదు చేశారు.
Bandi Sanjay
BJP
Remand

More Telugu News