కొత్త సంవత్సరంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలి: సీఎం కేసీఆర్

31-12-2021 Fri 20:11
  • మరికొన్ని గంటల్లో నూతన సంవత్సరాది
  • రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ సందేశం
  • అకుంఠిత దీక్షతో ముందుకు వెళతామని వ్యాఖ్య  
  • ప్రజా సంక్షేమమే పరమావధి అని ఉద్ఘాటన
CM KCR wishes people happy new year
తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2022లో కూడా కష్టాలను అధిగమిస్తూ, అదే అకుంఠిత దీక్షతో సుపరిపాలన కొనసాగిస్తామని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని ఉద్ఘాటించారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యమని పేర్కొన్నారు. కొత్త సంవత్సరంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.