స్పీకర్ బాక్సులు బద్దలవ్వాల్సిందే... భీమ్లా నాయక్ నుంచి 'లాలా భీమ్లా' డీజే సాంగ్ రిలీజ్
- పవన్ హీరోగా భీమ్లానాయక్
- సంగీతం సమకూర్చుతున్న తమన్
- ఇప్పటికే లాలా భీమ్లా పాట రిలీజ్
- తాజాగా డీజే వెర్షన్ ను తీసుకువచ్చిన చిత్రబృందం
మలయాళ చిత్రానికి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకుడు. ఇందులో పవన్ కల్యాణ్ కు ప్రతినాయకుడిగా రానా ఓ పవర్ ఫుల్ పాత్ర పోషించారు. పవన్ సరసన నిత్యామీనన్ కథానాయిక. కాగా, 'భీమ్లా నాయక్' చిత్రం జనవరి 12న రిలీజ్ కావాల్సి ఉండగా, ఇతర పెద్ద చిత్రాలు కూడా సంక్రాంతి బరిలో ఉండడంతో విడుదల తేదీని ఫిబ్రవరి 25కి వాయిదా వేశారు.