Mahesh Babu: మహేశ్ జోడీగా పూజ హెగ్డే ప్లేస్ లో సమంత?

Samantha in Mahesh Babu Movie
  • మహేశ్ తో త్రివిక్రమ్ మూవీ
  • తెరపైకి సమంత పేరు
  • గతంలో త్రివిక్రమ్ తో వరుస హిట్స్
  • మహేశ్ జోడీగాను మంచి మార్కులు
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో సమంత ఒకరు. తెలుగుతో పాటు తమిళంలోను ఇంచుమించు ఆమెకి అదే క్రేజ్ ఉంది. సమంత నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. 'ఓ బేబీ' వంటి సినిమాలు ఆమె నటనకి కొలమానంగా నిలుస్తాయి. 'శాకుంతలం' వంటి భారీ బడ్జెట్ సినిమాను గుణశేఖర్ ఆమెతో చేయడం మరో ఉదాహరణ.

ఇక ప్రస్తుతం సమంత చేస్తున్న 'యశోద' సినిమా కూడా కథాకథనాల పరంగా ఆమె స్థాయిని పెంచేదే. ఇక త్రివిక్రమ్ సినిమా కోసం కూడా ఆమెను సంప్రదిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే స్పెషల్ సాంగ్ కోసం కాదు .. హీరోయిన్ గానే. మహేశ్ తో త్రివిక్రమ్ చేయనున్న సినిమాకి మొదట్లో పూజ హెగ్డేను అనుకున్నారు.

అయితే పూజ డేట్స్ సర్దుబాటు చేయలేకపోతుండటంతో, సమంతను తీసుకోనున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఇంతకుముందు త్రివిక్రమ్ తో ఆమె 'అత్తారింటికి దారేది' .. 'సన్నాఫ్ సత్యమూర్తి' .. 'అ ఆ' సినిమాలు చేసింది. ఇక మహేశ్ జోడీగా ఆమె 'దూకుడు' .. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' ..'బ్రహ్మోత్సవం' చిత్రాలు చేసిన సంగతి తెలిసిందే.
Mahesh Babu
Samantha
Trivikram Movie

More Telugu News