Chiranjeevi: 2022ను ఈ హై ఓల్టేజ్ సాంగ్ తో ప్రారంభిద్దాం: చిరంజీవి

Chiranjeevi says new year will be started with high voltage song
  • 'ఆచార్య' చిత్రం నుంచి 'శానా కష్టం' పాట
  • జనవరి 3న రిలీజ్ అవుతుందన్న చిరంజీవి
  • కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' చిత్రం

మరికొన్ని గంటల్లో నూతన సంవత్సరం రానుంది. ఈ క్రమంలో 'ఆచార్య' చిత్రబృందం తరఫున మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. 'ఆచార్య' చిత్రం నుంచి 'శానా కష్టం' అనే మాస్ మసాలా పాట రిలీజ్ పై ట్వీట్ చేశారు. 2022ను ఈ హై ఓల్టేజ్ సాంగ్ తో ప్రారంభిద్దాం అంటూ పిలుపునిచ్చారు. 'శానా కష్టం' అనే పాట లిరికల్ వీడియో జనవరి 3న సాయంత్రం 4.05 గంటలకు విడుదల కానుందని వెల్లడించారు.

చిరంజీవి, రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే నటించిన 'ఆచార్య' చిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న 'ఆచార్య' చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.

  • Loading...

More Telugu News