Vishwak Sen: కరోనా బారినపడిన టాలీవుడ్ యువ హీరో విష్వక్ సేన్

Tollywood young hero Vishwak Sen tested corona positive
  • ఓ ప్రకటనలో వెల్లడించిన విష్వక్ సేన్
  • ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నానని వివరణ
  • ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని పిలుపు
టాలీవుడ్ యువ హీరో విష్వక్ సేన్ కరోనా బారినపడ్డాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించాడు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో తనకు పాజిటివ్ గా తేలిందని తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశాడు. తన వ్యక్తిగత వైద్యుడి సలహా మేరకు అన్ని మార్గదర్శకాలు పాటిస్తూ ఐసోలేషన్ లో ఉన్నానని విష్వక్ సేన్ వెల్లడించాడు.

వ్యాక్సినేషన్ తర్వాత కూడా కార్చిచ్చులాగా కరోనా వైరస్ వ్యాపిస్తుండడం దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డాడు. ప్రతి ఒక్కరూ దయచేసి మాస్కులు ధరించాలని, తద్వారా సురక్షితంగా ఉండాలని పిలుపునిచ్చాడు. తనపై చూపుతున్న ప్రేమాభిమానాలకు, మద్దతుకు కృతజ్ఞతలు అంటూ తన ప్రకటనలో పేర్కొన్నాడు.
Vishwak Sen
Corona Virus
Positive
Tollywood

More Telugu News