Polygamy: బహుభార్యత్వం భరించాల్సిందే కానీ.. ప్రోత్సహించాల్సినది కాదు: ఓ కేసులో గుజరాత్ హైకోర్టు వ్యాఖ్య

Muslim Law Permits Polygamy but not encouraged High Court
  • మరో మహిళతో కలసి జీవితాన్ని పంచుకోవాలని కోరే హక్కు భర్తకు లేదు
  • కాపురం చేయడం అన్నది మహిళ ఇష్టమే
  • సహజీవనంతో దాంపత్య హక్కులను సాధించలేరు
ఓ ముస్లిం మహిళకు సంబంధించిన కేసులో గుజరాత్ హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. మహిళను భర్తతో కాపురానికి బలవంతం చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ముస్లిం చట్టం బహుభార్యత్వాన్ని అనుమతించినా కానీ.. భర్తతో కలసి జీవించబోనని తిరస్కరించే హక్కు మొదటి భార్యకు ఉంటుందని స్పష్టం చేసింది.

‘‘భారత్ లో అమల్లో ఉన్న ముస్లిం పర్సనల్ లా.. బహుభార్యత్వాన్ని ఒక భరించాల్సిన ఆచారంగానే పరిగణిస్తోంది. తప్పించి అది ప్రోత్సహించాల్సినది కాదు. తన భార్యను మరో మహిళతో కలసి వైవాహిక జీవితం పంచుకోవాలని కోరే ప్రాథమిక హక్కు భర్తకు లేదు’’ అని గుజరాత్ హైకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది.

2021 జులైలో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఒక ముస్లిం మహిళ హైకోర్టులో సవాలు చేసింది. భర్త ఇంటికి వెళ్లి కాపురం చేసుకోవాలంటూ ఫ్యామిలీ కోర్టు ఆమెను ఆదేశించడం గమనార్హం. ‘‘ఏ వ్యక్తి కూడా ఒక మహిళ లేదా తన భార్యతో సహజీవనం చేయడం ద్వారా దాంపత్య హక్కులను సొంతం చేసుకోలేడు’’ అని కోర్టు పేర్కొంది.
Polygamy
muslim law
gujarat high court

More Telugu News