Raviteja: 'అట్టా సూడకే' అంటూ స్టెప్పులు అదరగొట్టిన రవితేజ!

  • 'ఖిలాడి'గా రవితేజ
  • దర్శకుడిగా రమేశ్ వర్మ
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ
  • ఫిబ్రవరి 11వ తీదీన విడుదల  
Khiladi lyrical song released

రవితేజ - రమేశ్ వర్మ కాంబినేషన్లో 'ఖిలాడి' సినిమా రూపొందింది. సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి మీనాక్షి చౌదరి పరిచయమవుతోంది. మరో కథానాయికగా డింపుల్ హయతి అందాల సందడి చేయనుంది. ఈ సినిమాను ఫిబ్రవరి 11వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ ను రిలీజ్ చేశారు. "అట్టా సూడకే మత్తెక్కుతాంది ఈడుకే .. ఒంట్లో వేడికే పిచ్చెక్కు తాంది నాడికే" అంటూ ఈ పాట సాగుతోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట బీట్ బాగుంది. యూత్ కి వెంటనే కనెక్ట్ అయ్యేలా ఉంది.

సమీరా భరద్వాజ్ తో కలిసి దేవిశ్రీ ప్రసాద్ పాడిన ఈ పాటకి శ్రీమణి సాహిత్యాన్ని అందించాడు. మాస్ ఆడియన్స్ కి వెంటనే పట్టేసే తేలికైన పదాలతో విన్యాసాలు చేయించాడు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకి ప్రధానమైన బలం అని చెప్పాలి. ఎప్పటిలానే రవితేజ ఫుల్ ఎనర్జీతో స్టెప్పులు అదరగొట్టేశాడు.

More Telugu News