తెలంగాణలో మరో 5 ఒమిక్రాన్ కేసులు.. కరోనా అప్డేట్స్ ఇవిగో!

30-12-2021 Thu 20:33
  • రాష్ట్రంలో 67కి చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య
  • 24 గంటల్లో 206 కరోనా కేసుల నమోదు
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,563
5 more Omicron cases in Telangana
తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇదే సమయంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో 5 ఒమిక్రాన్ కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 67కి చేరింది.
 
మరోవైపు గత 24 గంటల్లో తెలంగాణలో 280 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 206 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా కారణంగా ఒక వ్యక్తి మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,563 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,81,587కి పెరిగింది. వీరిలో 6,73,999 మంది కోలుకోగా... 4,025 మంది మృతి చెందారు.