'యశోద'లో సమంత పాత్ర ప్రత్యేకత అదేనట!
- రిలీజ్ కి రెడీ అవుతున్న 'శాకుంతలం'
- సైంటిఫిక్ థ్రిల్లర్ గా 'యశోద'
- ఇటీవలే మొదలైన షూటింగ్
- నర్స్ పాత్రలో కనిపించనున్న సమంత
ఈ నేపథ్యంలో ఆమె నాయిక ప్రధానమైన మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది .. ఆ సినిమా పేరే 'యశోద'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో ఉంది. అయితే ఈ సినిమా టైటిల్ ఎంత సాఫ్ట్ గా ఉంటుందో, సమంత పాత్ర కూడా అంతే సాఫ్ట్ గా ఉంటుందట. ఈ సినిమాలో ఆమె ఓ సాధారణమైన నర్స్ పాత్రను పోషిస్తోంది. ఈ పాత్ర చుట్టూనే ఈ కథ తిరుగుతుంది.
సైంటిఫిక్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది. దీనిని బట్టే యశోద అనే పాత్ర చుట్టూ అనూహ్యమైన పరిస్థితులు అలముకుంటాయనే విషయం అర్థమైపోతూనే ఉంది. ఓ సాధారణమైన పాత్ర చుట్టూ అసాధారణమైన సంఘటనలు అలముకోవడమే ఈ సినిమా అంటున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ .. ఉన్ని ముకుందన్ .. రావు రమేశ్ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు.