zomato: చవులూరిస్తున్న బిర్యానీ... జొమాటో యాప్ పై ప్రతీ సెకనుకు రెండు ఆర్డర్లు బిర్యానీ కోసమే!

  • 2021లో కస్టమర్ల ఆర్డర్ల గణాంకాల విడుదల
  • మొమోల కోసం కోటి మంది ఆర్డర్
  • దోశలు, సమోసాలకూ డిమాండ్
Zomato says 2 Biryanis delivered every second in 2021

బిర్యానీ అంటే పడిచచ్చేవారు చాలామంది వుంటారు. ఆది మరోసారి రుజువైంది. ఆహార పదార్థాల్లో బిర్యానీయే రారాజుగా వర్ధిల్లుతోందని ప్రముఖ ఆహార పదార్థాల డెలివరీ సంస్థ 'జొమాటో' విడుదల చేసిన తాజా గణాంకాలను చూస్తే తెలుస్తోంది. జొమాటో ప్లాట్ ఫామ్ పై 2021లో ప్రతీ సెకనుకు రెండు ఆర్డర్లు బిర్యానీ కోసమే వచ్చాయి. ఆ తర్వాత మొమోలనే ఎక్కువ మంది ఇష్టపడ్డారు. 2021లో మొత్తం మీద మొమోల కోసం కోటి ఆర్డర్లు వచ్చాయి. దోశలు కావాలంటూ 88 లక్షల మంది ఆర్డర్లు ఇచ్చారు.

ఇక సమోసాల కోసం వచ్చిన ఆర్డర్లు 72.97 లక్షలుగా ఉన్నాయి. వడాపావు కోసం 31.57 లక్షల ఆర్డర్లు వచ్చాయి. పనీర్ బటర్ మసాలా, బటర్ నాన్ ఈ రెండింటి కోసం యూజర్లు 11 లక్షల సార్లు ఆర్డర్ చేశారు. టీ20 వరల్డ్ కప్ సమయంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా 10,62,710 మంది ఫుడ్ కోసం ఆర్డర్ ఇచ్చారు.

2021లో ఒకే ఒక్క కస్టమర్ చేసిన అతిపెద్ద ఆర్డర్ విలువ రూ.33,000. అహ్మదాబాద్ కు చెందిన ఒక కస్టమర్ ఈ ఆర్డర్ ను ఇచ్చినట్టు జొమాటో తెలిపింది. ఇటీవల స్విగ్గీ సైతం తన ప్లాట్ ఫామ్ పై ఆర్డర్ల గణాంకాలను విడుదల చేసింది. అక్కడ ఎక్కువ ఆర్డర్లతో సమోసా నంబర్1గా ఉంటే, బిర్యానీ తర్వాతి స్థానంలో ఉంది. నిమిషానికి 115 బిర్యానీ ఆర్డర్లను స్విగ్గీ అందుకుంది.

More Telugu News