ఢిల్లీలో రెసిడెంట్ వైద్యులపై లాఠీచార్జ్.. నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్
- నీట్ పీజీ కౌన్సెలింగ్ చేపట్టాలంటూ రెసిడెంట్ వైద్యుల ఆందోళన
- సుప్రీంకోర్టు వరకూ ర్యాలీగా వెళ్లే యత్నం
- అడ్డుకుని లాఠీచార్జ్ చేసిన పోలీసులు
దీనిని అడ్డుకున్న పోలీసులు రెసిడెంట్ వైద్యులపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఎఫ్ఏఐఎంఏ నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేయాలని రెసిడెంట్ వైద్యులకు పిలుపునిచ్చింది. ఉదయం 8 గంటల నుంచి విధులకు దూరంగా ఉండాలని కోరింది.
మరోవైపు, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రెసిడెంట్ వైద్యులపై లాఠీచార్జ్, వైద్యుల నిర్బంధాన్ని ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఎఫ్ఆర్‌డీఏ) ఖండించింది. మంగళవారాన్ని ‘బ్లాక్ డే’గా ప్రకటించింది.