జోరు చూపుతున్న 'శ్యామ్ సింగ రాయ్'
- ఈ నెల 24న వచ్చిన 'శ్యామ్ సింగ రాయ్'
- తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు
- మూడు రోజుల్లో 24 కోట్ల గ్రాస్
- మరింతగా పెరగనున్న వసూళ్లు
ఒక వైపున ఒక రేంజ్ లో 'పుష్ప' దూకుడు కొనసాగుతుండటంతో, నాని సినిమా ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే, 'పుష్ప' పోటీని తట్టుకుని 'శ్యామ్ సింగ రాయ్' నిలబడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 16 కోట్ల గ్రాస్ ను 10 కోట్ల షేర్ ను వసూలు చేసిందని అంటున్నారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 24 కోట్ల గ్రాస్ .. 14 కోట్ల షేర్ ను రాబట్టినట్టుగా చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో .. అందునా 'పుష్ప' థియేటర్స్ లో ఉన్న ఈ సమయంలో ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం గొప్ప విషయమేనని అంటున్నారు. లాంగ్ రన్ లో చెప్పుకోదగిన మార్క్ ను ఈ సినిమా టచ్ చేస్తుందేమో చూడాలి.