Dinesh Mongia: బీజేపీలో చేరిన టీమిండియా మాజీ క్రికెటర్

Team India former cricketer Dinesh Mongia joins BJP
  • గతంలో టీమిండియాకు ఆడిన దినేశ్ మోంగియా
  • మూడేళ్ల కిందట ఆటకు గుడ్ బై
  • రాజకీయాలపై ఆసక్తి
  • ఢిల్లీలో కాషాయ కండువా కప్పుకున్న వైనం
క్రికెటర్లు రాజకీయాల్లో చేరడం భారత్ లో కొత్త కాదు. టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ మోంగియా కూడా రాజకీయ రంగంలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు. దినేశ్ మోంగియా పంజాబ్ ఆటగాడు. గతంలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించి, ఓ మోస్తరుగా రాణించాడు. మూడేళ్ల కిందట క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అయితే కొంతకాలంగా రాజకీయాలపై ఆసక్తి ప్రదర్శిస్తున్నాడు. ఇవాళ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో దినేశ్ మోంగియా బీజేపీ కండువా కప్పుకున్నాడు. పార్టీ ముఖ్య నేతలు ఈ మాజీ క్రికెటర్ ను సాదరంగా కాషాయదళంలోకి ఆహ్వానించారు.

అంతేకాదు, పంజాబ్ లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఇటీవల కాలంలో పంజాబ్ కాంగ్రెస్ లో వర్గ పోరు ఎక్కువైంది. మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా తీవ్ర విభేదాలతో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి, 'పంజాబ్ లోక్ కాంగ్రెస్' పేరిట ఓ పార్టీని నెలకొల్పి, వేరే కుంపటి పెట్టుకున్న సంగతి విదితమే. మరోపక్క, త్వరలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో బీజేపీలో చేరికలు, వలసలు ఊపందుకున్నాయి.
Dinesh Mongia
BJP
Punjab
Team India

More Telugu News