Sourav Ganguly: గంగూలీ ఆరోగ్యం, చికిత్సపై డాక్టర్ల స్పందన!

Health Bulletin Released On Sourav Ganguly
  • వుడ్ ల్యాండ్స్ హాస్పిటల్ లో చికిత్స  
  • మోనోక్లోనల్ యాంటీ బాడీ చికిత్స చేస్తున్నట్టు వెల్లడి
  • గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటన
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్యంపై వైద్యులు బులెటిన్ ను విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయనకు మోనోక్లోనల్ యాంటీ బాడీలతో చికిత్స చేస్తున్నామని కోల్ కతాలోని వుడ్ ల్యాండ్స్ హాస్పిటల్ ఎండీ, సీఈవో డాక్టర్ రూపాలీ బసూ ప్రకటించారు.

నిన్న గంగూలీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆయనను వుడ్ ల్యాండ్స్ ఆసుపత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. ఆయనకు డాక్టర్ దేవిశెట్టి, డాక్టర్ అఫ్తాబ్ ఖాన్ ల సలహాలు తీసుకుంటూ డాక్టర్ సప్తర్షి బసూ, డాక్టర్ సౌతిక్ పాండాల వైద్యుల బృందం చికిత్స చేస్తోందని రూపాలీ బసూ చెప్పారు. మందులను సమయానికి డోసులువారీగా ఇస్తున్నట్టు తెలిపారు.
Sourav Ganguly
BCCI
COVID19
West Bengal

More Telugu News