Centurion: సెంచురియన్ లో ఆగని వాన... ఒక్క బంతి పడకుండానే లంచ్ కు వెళ్లిన ఆటగాళ్లు

Team India and South Africa goes for lunch without played a single ball
  • టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు
  • సెంచురియన్ లో వరుణుడి జోరు
  • లంచ్ తర్వాత మైదానాన్ని పరిశీలించనున్న అంపైర్లు
  • రెండో రోజు ఆట ప్రారంభం మరింత ఆలస్యం
టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టుపై వరుణుడి ప్రభావం పడింది. సెంచురియన్ లో ఇప్పటికీ వర్షం పడుతూనే ఉండడంతో ఆట ఇంతవరకు ప్రారంభం కాలేదు. దాంతో ఒక్క బంతి కూడా పడకుండానే ఇరుజట్ల ఆటగాళ్లు లంచ్ కు వెళ్లారు. లంచ్ తర్వాత అంపైర్లు మరోసారి మైదానాన్ని పరిశీలించాలని నిర్ణయించినా, పరిస్థితి అందుకు అనుకూలంగా కనిపించడంలేదు. జల్లులు కురుస్తూనే ఉండడంతో ఆట ప్రారంభం మరింత ఆలస్యం కానుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా తొలిరోజు ఆటలో 3 వికెట్లకు 272 పరుగులు చేయడం తెలిసిందే.
Centurion
Rain
Lunch
Team India
South Africa
First Test

More Telugu News