Theaters Owners: మంత్రి పేర్ని నాని అపాయింట్ మెంట్ కోరిన థియేటర్ల యజమానులు

Theaters owners seeks minister Perni Nani appointment
  • ఏపీలో సినిమా టికెట్ల రగడ
  • ధరలు భారీగా తగ్గించిన ప్రభుత్వం
  • ఇలాగైతే థియేటర్లు నడపలేమంటున్న యాజమాన్యాలు
  • మంత్రితో చర్చించాలని నిర్ణయం

ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు వ్యవహారంపై తీవ్రస్థాయిలో అసంతృప్తి రాజుకుంటోంది. ఇటు ఏపీ సర్కారు, అటు టాలీవుడ్ మధ్యన సినిమా థియేటర్ల యజమానులు నలిగిపోతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలోని సినిమా థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు టికెట్ ధరలపై ప్రభుత్వంతో చర్చించాలని నిర్ణయించారు.

రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు సమయం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలను సామరస్య ధోరణిలో పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని థియేటర్ల యజమానులు స్పష్టం చేశారు. కాగా, థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు మంత్రి పేర్ని నానిని రేపు కలిసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News