పోప్ ఫ్రాన్సిస్ చనిపోయారంటూ పొరపాటున ప్రకటించిన మహిళా జర్నలిస్టు.. తీవ్ర విమర్శలు!

27-12-2021 Mon 14:35
  • క్రిస్మస్ రోజున లైవ్ టెలికాస్ట్ చేసిన ఐటీవీ
  • పోప్ చనిపోయినట్టు పొరపాటున ప్రకటించిన కైలీ పెంటెలో
  • పొరపాటును గ్రహించి క్షమాపణ చెప్పిన వైనం
Journalist Wrongly Announces Popes Death In Live TV Blunder
తాజా సమాచారం కోసం ప్రజలంతా న్యూస్ ఛానళ్లు, వార్తాపత్రికలు, వెబ్ సైట్లపై ఆధారపడుతుంటారు. అందులో వచ్చే సమాచారం నిజమే అని నమ్ముతారు. ఒకవేళ పొరపాటున తప్పుడు సమాచారం ప్రసారమైతే, అది కూడా అత్యంత కీలకమైన వ్యక్తికి సంంధించినదైతే పరస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు అలాంటి పెద్ద పొరపాటే ఒకటి జరిగింది.

క్రైస్తవ మత గురువైన పోప్ చనిపోయారని ఓ టీవీ చానల్ లైవ్ లో ప్రకటించింది. క్రిస్మస్ రోజున ఐటీవీ న్యూస్ లైవ్ టెలికాస్ట్ చేస్తోంది. ఈ సమయంలో మహిళా జర్నలిస్టు కైలీ పెంటెలో పొరపాటున పోప్ ఫ్రాన్సిస్ చనిపోయారని ప్రకటించారు. వెంటనే విషయాన్ని గ్రహించి క్షమాపణలు చెప్పారు. అయితే నెటిజెన్లు ఈ పొరపాటుపై మండిపడ్డారు. గతంలో మీడియా చేసిన ఇలాంటి పొరపాట్లను షేర్ చేస్తున్నారు.