Team India: దక్షిణాఫ్రికాతో మొదటి టెస్టు ప్రారంభం... టాస్ గెలిచిన టీమిండియా

Team India won the toss and elected batting first against South Africa
  • టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య 3 టెస్టుల సిరీస్
  • సెంచురియన్ వేదికగా తొలి టెస్టు
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఉంచుకున్న భారత్
  • తుది జట్టులో సిరాజ్ కు చోటు
టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టు నేడు ప్రారంభమైంది. సెంచూరియన్ లోని సూపర్ స్పోర్ట్ పార్క్ ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ బరిలో దిగారు. 9 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది.

భారత్ జట్టు ఇదే...
విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

దక్షిణాఫ్రికా జట్టు ఇదే...
డీన్ ఎల్గార్ (కెప్టెన్), ఐడెన్ మార్ క్రమ్, కీగన్ పీటర్సన్, రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, టెంబా బవుమా, క్వింటన్ డికాక్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడా, లుంగీ ఎంగిడి.
Team India
Toss
South Africa
Centurion
First Test

More Telugu News