Team India: టాస్ గెలిచిన టీమిండియా... తుది జ‌ట్టు ఇదే

india opts bat first
  • దక్షిణాఫ్రికాతో మూడు టెస్టు మ్యాచులు
  • నేడు తొలి మ్యాచ్ ప్రారంభం
  • బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ
దక్షిణాఫ్రికా-భార‌త్ క్రికెట్ జ‌ట్ల మ‌ధ్య‌ మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేడు తొలి మ్యాచ్ జ‌రుగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భార‌త జ‌ట్టులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మ‌యాంక్ అగ‌ర్వాల్, చ‌టేశ్వ‌ర పుజారా, అజింక్యా ర‌హానె, రిష‌భ్ పంత్‌, శార్దూల్ ఠాకూర్, ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, ష‌మీ, జ‌స్ప్రిత్ భుమ్రా, సిరాజ్ ఉన్నారు. కాగా, ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆతిథ్య జ‌ట్టుతో భార‌త్ మూడు టెస్టుల‌తో పాటు మూడు వ‌న్డే మ్యాచులు ఆడ‌నుంది.  

      
Team India
south africa
Cricket

More Telugu News