పారిశ్రామిక అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ.. దేశంలోనే మొదటి స్థానం
- 2020-21లో 8.78 శాతం వృద్ధి
- ఆంధ్రప్రదేశ్ కు ఆరోస్థానం
- సాంఘిక సంక్షేమంలోనూ నంబర్ 1 స్థానం
పారిశ్రామికాభివృద్ధిలో తెలంగాణకు 0.699 స్కోరు లభించింది. గుజరాత్ రాష్ట్రం 0.662 స్కోరుతో రెండో స్థానంలో ఉంది. 0.627 స్కోరుతో పారిశ్రామికాభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరో స్థానంలో నిలిచింది. ఇక దేశంలో సుపరిపాలన పరంగా గుజరాత్ మొదటి స్థానంలో ఉంటే, మహారాష్ట్ర రెండో స్థానం సొంతం చేసుకుంది. ఈ విషయంలో తెలంగాణ 9వ స్థానం, ఏపీ 10వ స్థానంలో నిలిచాయి. సాంఘిక సంక్షేమం, అభివృద్ధిలోనూ తెలంగాణకు మొదటి స్థానం లభించింది. 0.699 స్కోరు దక్కింది. ఏపీ 0.546 స్కోరుతో ఆరో స్థానంలో ఉంది.