Dhanush: జోరు చూపుతున్న కేరళ బ్యూటీ!

Sir Movie Update
  • మలయాళ సినిమాల్లో మంచి క్రేజ్
  • తమిళ .. కన్నడలోను ఇమేజ్
  • తెలుగు తెరపై సందడికి రెడీ
  • ధనుశ్ 'సార్' సినిమాలోను ఛాన్స్
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ కి పరిచయమైన కథానాయికలలో కృతి శెట్టి .. కేతిక శర్మ .. శ్రీలీల పేర్లు మాత్రమే ప్రధానంగా వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాదిలో విడుదలవుతున్న చాలా సినిమాలలో కొత్త కథానాయికలు ఎక్కువగా కనిపించనున్నారు. అలాంటి కథానాయికల జాబితాలో సంయుక్త మీనన్ పేరు కూడా చేరిపోయింది. 

మలయాళ సినిమా 'పాప్ కార్న్' తో తన కెరియర్ ను మొదలుపెట్టిన సంయుక్త, ఆ వెంటనే 'కలరి' అనే సినిమాతో కోలీవుడ్ లో కాలు పెట్టేసింది. పనిలో పనిగా కన్నడలో 'గాలిపట' చేసిన ఈ సుందరి, టాలీవుడ్ కి తన గ్లామర్ సత్తా ఏమిటో చెప్పాలనే గట్టి పట్టుదలతోనే ఉన్నట్టుగా తెలుస్తోంది.

తెలుగులో ఈ బ్యూటీ చేసిన 'భీమ్లా నాయక్' .. 'బింబిసార' విడుదలకి సిద్ధంగానే ఉన్నాయి. ఈ సినిమాల తరువాత సంయుక్త జోరు పెరిగే అవకాశాలు ఉన్నాయని అనుకునేలోగానే మరో ఛాన్స్ కొట్టేసింది. తెలుగు .. తమిళ భాషల్లో ధనుశ్ నటిస్తున్న 'సార్' సినిమా కోసం ఎంపికైంది. ఇక ఈ కేరళ కుట్టీ దూకుడు మొదలైపోయిందనే అనుకోవాలేమో!
Dhanush
Samyuktha Menen
Venky Atluri
Sir Movie

More Telugu News