Karnataka: ఇరుపక్షాలదీ తప్పే... క్రైస్తవులపై జరిగిన దాడులపై కర్ణాటక హోంమంత్రి స్పందన

Karnataka Home Minister response on attacks on Christians
  • క్రైస్తవుల ప్రేయర్ మీటింగులపై దాడులు
  • మతమార్పిడులకు పాల్పడుతున్నారంటూ దాడులు
  • తప్పు రెండు వైపులా ఉందన్న హోంమంత్రి
మతమార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోద ముద్ర వేసిన సంగతి. కాంగ్రెస్ సహా ఇతర విపక్షాల ఆందోళనల మధ్యే క్రిస్మస్ కు రెండు రోజుల ముందు ఈ బిల్లును ఆమోదించారు. మరోవైపు కర్ణాటకలో క్రైస్తవులపై దాడులు జరిగాయి. మతమార్పిడులకు పాల్పడుతున్నారంటూ వారి ప్రేయర్ మీటింగులపై కొందరు దాడులకు పాల్పడ్డారు.

ఈ ఘటనలపై కర్ణాటక హోంమంత్రి జ్ఞానేంద్ర మాట్లాడుతూ, తప్పు ఇరుపక్షాల వైపు ఉందని అన్నారు. ఒకవేళ వారు బలవంతపు మతమార్పిడులకు పాల్పడకపోతే మౌనంగా ఉండొచ్చని, రచ్చ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఏ ఒక్కరూ కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని... జరిగిన దానిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో బలవంతపు మతమార్పిడులు జరుగుతున్న విషయం నిజమేనని అన్నారు.
Karnataka
Religious Conversions
Christians
Attacks
Home Minister

More Telugu News