ABN Andhra Jyothi: హైదరాబాదులో రోడ్డు ప్రమాదం.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ దుర్మరణం!

ABN Andhra Jyothi journalist Madhusudhan dead in accident
  • ఉదయం ఇంటి నుంచి డ్యూటీకి వస్తుండగా ప్రమాదం
  • బైక్ ను వేగంగా ఢీకొన్న ట్రక్కు
  • అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్

రోడ్డు ప్రమాదంలో ఓ యువ జర్నలిస్ట్ దుర్మరణంపాలు కావడం మీడియా రంగంలో విషాదాన్ని నింపింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్నెట్ డెస్క్ లో సబ్ ఎడిటర్ గా పని చేస్తున్న ఓతూరి మధుసూదన్ ఈ ఉదయం దుర్మరణం చెందారు.

ఉదయం ఇంటి నుంచి డ్యూటీకి వస్తుండగా బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దగ్గర ఆయన బైక్ ను ఓ ట్రక్ ఢీకొంది. అత్యంత వేగంగా వచ్చిన ఆ ట్రక్ బైక్ ను డీకొట్టిన తర్వాత ఆగకుండా వెళ్లిపోయింది. ఈ దుర్ఘటనలో మధుసూదన్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ట్రక్కును పోలీసులు గుర్తించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు మధు మృతి పట్ల జర్నలిస్టులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

  • Loading...

More Telugu News