Mahinda Rajapaksa: శ్రీవారి దర్శనానికి విచ్చేసిన శ్రీలంక ప్రధాని కుటుంబం.... హార్దిక స్వాగతం పలికిన ఏపీ డిప్యూటీ సీఎం

Sri Lankan prime minister Mahinda Rajapaksa and family arrives Tirupati
  • తిరుమలలో రాజపక్స రెండ్రోజుల పర్యటన
  • ఈ మధ్యాహ్నం రేణిగుంట చేరుకున్న శ్రీలంక ప్రధాని బృందం
  • ఈ రాత్రికి తిరుమలలో బస
  • రేపు ఉదయం స్వామివారి దర్శనం

శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేశారు. రాజపక్స కుటుంబం రెండు రోజుల పాటు తిరుమలలో గడపనుంది. ఈ మధ్యాహ్నం భారత్ చేరుకున్న శ్రీలంక ప్రధానికి రేణిగుంట విమానాశ్రయంలో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ హార్దిక స్వాగతం పలికారు.

ఈ రాత్రికి తిరుమలలో బస చేయనున్న రాజపక్స కుటుంబం రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనుంది. శ్రీలంక ప్రధాని రాక నేపథ్యంలో టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. రాజపక్స తిరుమల వెంకన్న భక్తుడు. ఆయన గతంలోనూ ఇక్కడికి పలు పర్యాయాలు విచ్చేసి స్వామివారిని సేవించుకున్నారు. చివరిగా గతేడాది ఫిబ్రవరిలో తిరుమలను సందర్శించారు.

  • Loading...

More Telugu News