Azaz Patel: బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ కు అజాజ్ పటేల్ ను తప్పించిన న్యూజిలాండ్!

Azaz Patel not selected for test series
  • ఇండియాతో జరిగిన టెస్టులో 10 వికెట్లు తీసిన అజాజ్ పటేల్
  • జనవరి 1 నుంచి బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్
  • అజాజ్ ను పక్కన పెట్టడానికి గల కారణాలను వెల్లడించని బోర్డు
ఇటీవల ముంబైలో ఇండియాతో జరిగిన టెస్టు మ్యాచ్ లో న్యూజిలాండ్ స్పిన్ బౌలర్ అజాజ్ పటేల్ ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే. అలాంటి అజాజ్ ను న్యూజిలాండ్ బోర్డు పక్కన పెట్టింది. జనవరి 1 నుంచి స్వదేశంలో బంగ్లాదేశ్ తో కివీస్ జట్టు టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కు అజాజ్ ను ఎంపిక చేయలేదు. అయితే దీనికి గల కారణాలను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించలేదు. అయితే అతనికి విశ్రాంతిని ఇచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ సిరీస్ కు టామ్ లాథమ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. సిరీస్ కు ఎంపిక చేసిన ఆటగాళ్లలో రచిన్ రవీంద్ర మాత్రమే స్పిన్నర్ గా ఉన్నాడు.
Azaz Patel
Team New Zealand

More Telugu News