Roja: ప్రమాదంలో కాళ్లు కోల్పోయిన విద్యార్థికి రోజా ఆసరా

  • ఏప్రిల్ లో రేణిగుంట రైల్వే స్టేషన్ లో ఘటన
  • రైలు దిగుతుండగా ప్రమాదానికి గురైన బాలమురుగన్
  • రెండు కాళ్లు తొలగించిన వైద్యులు
  • స్కూటీని అందజేసిన రోజా
Roja helps student Balamurugan in Nagari

వైసీపీ ఎమ్మెల్యే రోజా పెద్ద మనసు చాటుకున్నారు. ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన విద్యార్థికి చేయూతనిచ్చారు. నగరిలోని పుదుపేటకు చెందిన కేపీ బాలమురుగన్ ఏప్రిల్ నెలలో ప్రమాదానికి గురయ్యాడు. రేణిగుంట రైల్వే స్టేషన్ లో రైలు దిగుతుండగా కాలుజారి పడిపోయాడు. దాంతో రెండు కాళ్లు నలిగిపోయాయి. వైద్యులు రెండు కాళ్లను తొలగించి కృత్రిమ కాళ్లు అమర్చారు. 21 ఏళ్ల బాలమురుగన్ ఈ ఘటనతో కాలేజీకి వెళ్లలేక, విద్యను కొనసాగించలేక కుమిలిపోయాడు.

అతడి పరిస్థితిని తెలుసుకున్న రోజా ఉదారంగా స్పందించారు. రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అతడికి ఓ స్కూటీని అందజేశారు. నిన్న జగన్ పుట్టినరోజు సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో స్కూటీని బహూకరించారు. ఈ సందర్భంగా రోజాకు బాలమురుగన్, అతడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. బాలమురుగన్ పేద చేనేత కుటుంబానికి చెందినవాడు.

More Telugu News