మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ వివాదం... హైకోర్టులో సంచయిత గజపతిరాజు పిటిషన్

22-12-2021 Wed 15:28
  • అశోక్ ను మాన్సాస్ ఛైర్మన్ గా నియమించిన హైకోర్టు సింగిల్ బెంచ్
  • డివిజన్ బెంచ్ లో సవాల్ చేసిన సంచయిత
  • తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసిన హైకోర్టు
Sanchaita files petition in AP high court on MANSAS
మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ నియామకానికి సంబంధించి ఏపీ హైకోర్టులో సంచయిత గజపతిరాజు పిటిషన్ వేశారు. ట్రస్టు ఛైర్మన్ గా తనను తొలగించి అశోక్ గజపతిరాజును మళ్లీ నియమించడంపై ఆమె పిటిషన్ వేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ గా అశోక్ గజపతిరాజును తొలగించింది. ఆయన స్థానంలో సంచయిత గజపతిరాజును నియమించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ అశోక్ గజపతిరాజును మళ్లీ ఛైర్మగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ సంచయిత డివిజన్ బెంచ్ లో పిటిషన్ వేశారు. పిటిషన్ ను స్వీకరించిన డివిజన్ బెంచ్ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.