Varla Ramaiah: ఆలయాల్లో రాజకీయం వద్దు.. అది అనర్థ‌దాయకం: వ‌ర్ల రామ‌య్య

varlara maiah slams jagan
  • ప్ర‌భుత్వం అశోక్ గజపతి రాజు గారిని వెంటాడుతోంది
  • అడుగడుగునా అవమానాల పాలుచేస్తున్నారు
  • కావాలని రామతీర్థం దేవాలయ ప్రొటోకాల్ లో అవమానించారు

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం బోడికొండపై రామాలయ నిర్మాణ శంకుస్థాప‌న జ‌రుగుతోన్న వేళ ఏపీ ప్ర‌భుత్వ అధికారులు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు మ‌ధ్య తోపులాట చోటు చేసుకుని ఉద్రిక్త‌త నెల‌కొన్న విష‌యం తెలిసిందే. దీంతో అశోక్ గ‌జ‌ప‌తి రాజుపై పోలీసులు, అధికారులు ప్ర‌వ‌ర్తించిన తీరుపై టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య మండిప‌డ్డారు. ఆల‌యాల వ‌ద్ద‌ ఇటువంటి ఘ‌ట‌న‌లు స‌రికాదంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు.

'ముఖ్యమంత్రి గారూ! మీ ప్రభుత్వమెందుకో మ‌హారాజ వంశస్తుడయిన అశోక్ గజపతి రాజు గారిని అనవసరంగా వెంటాడుతోంది. తరాలుగా వందల దేవస్థానాలకు ధర్మకర్తలయిన వారిని అడుగడుగునా అవమానాల పాలుచేస్తున్నారు. కావాలని రామతీర్థం దేవాలయ ప్రొటోకాల్ లో కూడా అవమానించారు. ఆలయాల్లో రాజకీయం వద్దు. అది అనర్థ‌దాయకం' అని వ‌ర్ల రామ‌య్య ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

  • Loading...

More Telugu News