Andhra Pradesh: ఏపీలో రెండో ఒమిక్రాన్ కేసు నిర్ధారణ!

Second Omicron case detected in Andhra Pradesh
  • కెన్యా నుంచి వచ్చిన మహిళకు ఒమిక్రాన్
  • డిసెంబర్ 12న కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
  • జీనోమ్ సీక్వెన్స్ లో ఒమిక్రాన్ పాజిటివ్ గా రిపోర్ట్
ఒమిక్రాన్ మహమ్మారి తెలుగు రాష్ట్రాలపై కూడా ప్రభావాన్ని చూపుతోంది. తెలంగాణలో ఇప్పటికే 20 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో తాజాగా రెండో ఒమిక్రాన్ కేసు నిర్ధారణ అయింది. కెన్యా నుంచి వచ్చిన 39 ఏళ్ల మహిళకు పాజిటివ్ గా తేలింది.

ఈమె కెన్యా నుంచి చెన్నైకు, అక్కడి నుంచి తిరుపతికి చేరుకున్నారు. డిసెంబర్ 12న ఆమెకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఆమె శాంపిల్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించగా... ఈరోజు ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే ఆమె కుటుంబ సభ్యులకు నెగెటివ్ వచ్చింది. ఆమెకు పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో.. ఆమెకు కాంటాక్ట్ లోకి వచ్చిన వారికి పరీక్షలను నిర్వహించేందుకు ఆరోగ్యశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు విజయనగరం జిల్లాలో నమోదైన సంగతి తెలిసిందే.
Andhra Pradesh
Omicron
Second Case

More Telugu News