Subhani: ఒంగోలు వైసీపీ కార్యకర్త సుబ్బారావు గుప్తాపై దాడి చేసిన సుభానీ అరెస్ట్

Police arrests Subhani who attacked on Subbarao Gupta
  • వైసీపీ ముఖ్య నేతలపై సుబ్బారావు వ్యాఖ్యలు
  • ఒంగోలులో సుబ్బారావు నివాసంపై దాడి
  • గుంటూరులో తలదాచుకున్న సుబ్బారావు
  • అక్కడికి కూడా వెళ్లిన కొందరు వ్యక్తులు
  •  లాడ్జీలో సుబ్బారావుపై దాడి
కొడాలి నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ తదితరులు మాట్లాడుతున్న తీరు పార్టీకి చేటు అని ఒంగోలు వైసీపీ కార్యకర్త సుబ్బారావు గుప్తా వ్యాఖ్యలు చేయడం... ఆయనపై సుభానీ అనే వ్యక్తి దాడి చేయడం తెలిసిందే. సుబ్బారావు గుప్తా... ఒంగోలులో మంత్రి బాలినేని వాసు పుట్టినరోజు వేడుకల్లో ఈ వ్యాఖ్యలు చేయగా, ఆయనకు తీవ్ర బెదిరింపులు వచ్చాయి. ఒంగోలులో ఆయన నివాసంపై దాడి కూడా జరిగింది. దాంతో సుబ్బారావు గుంటూరు వెళ్లి ఓ లాడ్జిలో తలదాచుకున్నారు.

అయినప్పటికీ వెంటాడిన కొందరు వ్యక్తులు లాడ్జీలోకి ప్రవేశించి సుబ్బారావును చితకబాదారు. ముఖ్యంగా, సుభానీ అనే వ్యక్తి సుబ్బారావును తీవ్రంగా కొట్టడమే కాకుండా, మోకాళ్లపై కూర్చోబెట్టి మంత్రి బాలినేనికి క్షమాపణలు చెప్పించారు. ఈ వీడియో వైరల్ అయింది. దీనిపై ఆర్య వైశ్య సంఘాలు భగ్గుమన్నాయి.

ఈ నేపథ్యంలో, పోలీసులు రంగంలోకి దిగారు. సుబ్బారావుపై దాడికి పాల్పడినట్టు వీడియో ఆధారాలు ఉన్న నేపథ్యంలో సుభానీని అరెస్ట్ చేశారు. ఈ మేరకు డీఎస్పీ నాగరాజు వివరాలు తెలిపారు. ఇదిలావుంచితే, ఈ రోజు సుబ్బారావు విజయవాడ వెళ్లి మంత్రి బాలినేనిని కలవడం.. ఇద్దరూ కలిసి సీఎం జగన్ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి పరస్పరం తినిపించుకోవడం విదితమే!   
Subhani
Arrest
Police
Subbarao Gupta
YSRCP
Ongole

More Telugu News