Samantha: సెక్సీగా కనిపించాలంటే ఎంతో కష్టపడాలి: సమంత

Being sexy is next level hard work says Samantha
  • నేను మంచి పాత్రలూ చేశాను, చెడ్డ పాత్రలూ చేశాను
  • చాట్ షో హోస్ట్ గా కూడా ఉన్నా
  • ప్రతి పనిని ఎంతో కష్టపడి చేస్తా
'పుష్ప' సినిమాలో సమంత చేసిన 'ఊ అంటావా మావా' పాటకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. యూట్యూబ్ లో ఈ పాట దూసుకుపోతోంది. మరోవైపు అదే స్థాయిలో ఈ పాటపై విమర్శలు కూడా వచ్చాయి. మగవాళ్లను చులకన చేసేలా పాట ఉందని కొందరు విమర్శిస్తున్నారు. మరోవైపు ఈ పాటలో సమంత అందాలను ఆరబోసింది. దీనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరుగుతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఇన్స్టాలో సమంత స్పందిస్తూ... 'నేను మంచి పాత్రలూ చేశాను, చెడ్డ పాత్రలూ చేశాను, ఫన్నీగా ఉన్నా, సీరియస్ గా కూడా ఉన్నా. చాట్ షో హోస్ట్ గా కూడా ఉన్నా. నేను చేసే ప్రతి పని విజయవంతం కావడానికి ఎంతో కష్టపడి చేస్తా. అయితే సెక్సీగా ఉండాలంటే అంతకు మించి కష్టపడాలి' అని వ్యాఖ్యానించింది.
Samantha
Tollywood
Pushpa

More Telugu News