15 ఏళ్ల బాలికను గర్భవతిని చేసిన బాలుడి అరెస్ట్
- విశాఖపట్టణం జిల్లా చింతపల్లి మండలంలో ఘటన
- బాలికతో పరిచయం పెంచుకుని శారీరక సంబంధం
- 8 నెలల గర్భిణి అని తెలిసి హతాశులైన తల్లిదండ్రులు
- బాలుడిని అరెస్ట్ చేసి జువైనల్ హోంకు తరలింపు
ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పెరిగిన పరిచయం ప్రేమగా మారింది. అది శారీరక సంబంధానికి దారి తీసింది. ఇటీవల బాలిక ఆరోగ్యం క్షీణించడంతో తల్లిదండ్రులు ఆమెను నర్సీపట్నం ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాలిక 8 నెలల గర్భవతి అని చెప్పడంతో తల్లిదండ్రులు హతాశులయ్యారు. బాలుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని అరెస్ట్ చేసి జువైనల్ హోంకు తరలించారు.