Balakrishna: 'వేటపాలెం' నుంచే బాలయ్య దబిడి దిబిడి షురూ!

  • గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ
  • వచ్చేనెలలో రెగ్యులర్ షూటింగ్
  • యాక్షన్ ఎపిసోడ్ తో మొదలు
  • కథానాయికగా శ్రుతి హాసన్  
Balakrishna in Gopichand Malineni movie update

బాలకృష్ణ అంటే యాక్షన్ .. బాలకృష్ణ అంటే ఎమోషన్ .. బాలకృష్ణ అంటే పవర్ఫుల్ మాస్ డైలాగ్స్. ఏ డైరెక్టర్ ఎలాంటి కథను ఆయనతో చేయాలన్నా ఈ అంశాలన్నీ ఉండవలసిందే. అలాంటి అంశాలను కలుపుకుని ఆయన కోసం గోపీచంద్ మలినేని ఒక కథను రెడీ చేశాడు. ఈ కథ రాయలసీమ నేపథ్యంలోనే మొదలవుతుంది.

ఈ సినిమాకి 'వేటపాలెం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దాదాపు అదే టైటిల్ ను ఖరారు చేయవచ్చని అంటున్నారు. ఎందుకంటే 'వేటపాలెం'లో జరిగిన ఒక సంఘటనను ఆధారంగా చేసుకునే ఈ కథ నడుస్తుందట. అందువలన ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ఆ ఊళ్లోనే మొదలవుతుందని అంటున్నారు.

జనవరి 28వ తేదీన బాలకృష్ణ తదితరులపై 'వేటపాలెం'లో ఒక యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తారట. ఆ తరువాత సన్నివేశాలను హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తారని చెబుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, ప్రతినాయకుడిగా అర్జున్ కనిపించనున్నాడని అంటున్నారు.

More Telugu News